23-08-2025 05:35:28 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన పోటీలలో ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు కళాశాల కరస్పాండెంటు పెట్టం మల్లేష్ తెలిపారు. అండర్ 20 బాలుర విభాగం జావెలిన్ త్రోలో ముత్తినేని వివేక్ ప్రథమ స్థానంలో నిలువగా, అండర్ 18 బాలికల విభాగం షార్ట్ ఫుట్ లో కుర్రు శ్రీవాణి ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అభినందించారు.