23-08-2025 05:35:10 PM
హాజీపూర్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్(Mancherial District Athletics Association) సెక్రటరీ మారయ్య ఆధ్వర్యంలో ఈ నెల 22న మంచిర్యాల డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో నిర్వహించిన జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మీట్ లో భాగంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో సాంఘిక సంక్షేమ బాలుర(మంచిర్యాల) ముల్కల్ల పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ కుమ్మరి మోహన్ తెలిపారు. అండర్ 14 విభాగంలో ఏ నీరజ్ ట్రైయాతలాన్(ఏ) లాంగ్ జంప్ లో సిల్వర్ మెడల్, 60 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్, హై జంప్ లో సిల్వర్ మెడల్ సాధించగా సాయి దినేష్ ట్రైయాతలాన్ (బి)లో 60 మీటర్స్ పరుగు పందెంలో సిల్వర్, లాంగ్ జంప్ లో సిల్వర్, షార్ట్ పుట్ బ్యాక్ త్రోలో బ్రాంజ్ మెడల్ సాధించారు.
16 సంవత్సరాల విభాగంలో కే జస్వంత్ 60 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్, 600 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్, ఏ అరుణ్ కుమార్ లాంగ్ జంప్ లో సిల్వర్ మెడల్ సాధింరాు. ఎస్ సుజిత్ లాంగ్ జంప్ లో బ్రాంజ్ మెడల్ సాధించారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను వైస్ ప్రిన్సిపాల్ మహేశ్వరరావు, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రమేష్. వ్యాయామ ఉపాధ్యాయులు కుమ్మరి శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.