calender_icon.png 23 July, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్ విద్యార్థినుల వేధింపులపై ఫిర్యాదు

23-07-2025 12:00:00 AM

నారాయణఖేడ్, జూలై 22:  నారాయణ ఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ మహిళ బీసీ కళాశాల వసతి గృహంలో హాస్టల్ వార్డెన్ కుమారుడు విద్యార్థినులను వేధింపులకు గురి చేయడంతో  విద్యార్థినుల తల్లిదం డ్రులు సోమవారం రాత్రి నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ కుమారుడు హాస్టల్ కు వచ్చి విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నాడని వారు ఆరోపించారు.

హాస్టల్ కు వార్డెన్ రాకుండా తన కుమారుణ్ణి పంపించడం జరుగుతుం దని విద్యార్థులు తెలిపారు. రోజు హాస్టల్ సిబ్బందితో పాటు వార్డెన్ సైతం తమను దురుసుగా మాట్లాడుతున్నారని వాపో యారు. సంఘటనపై ఫిర్యాదును స్వీకరిం చిన పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని వారికి హామీ ఇచ్చారు. కాగా మంగళవారం విషయం తెలుసుకున్న వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ వద్దకు చేరుకొని ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.

హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని, వేధింపులకు గురిచేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎస్త్స్ర విద్యాచరన్ రెడ్డి హాస్టల్ వద్దకు చేరుకొని విద్యార్థి సంఘాల నాయకులను సముదాయించి ఆందోళనను విరమింప చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.