28-01-2026 12:00:00 AM
అలంపూర్, జనవరి 27: వడ్డేపల్లి మండలం బుడమొర్సు గ్రామ శివారులో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను ఆపాలంటూ గ్రామస్తులు తాహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తాహాసిల్దార్ శివకుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. గ్రామస్తులు మాట్లాడుతూ... గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వందల కొద్ది సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా అక్రమ మట్టిని రవాణా చేస్తున్నట్లు ఆరోపించారు. అధికారులు అడ్డుకట్ట వేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరారు.