28-01-2026 12:00:00 AM
ఆహ్వానించిన పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియో జకవర్గానికి చెందిన నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసు, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు సంపత్ కుమార్ అధ్యక్షతన వా రు పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి హరిశంకర్‌గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ బళిదారపు నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన మహిళా నాయకులు హైదరాబాద్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధి నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో ఆ పార్టీలో చేరారు. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి వట్టె జానయ్య ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి గ్రామ అధ్యక్షుడిగా హనుమంతు యాదవ్, గిరిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ శంకర్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు నర్సయ్య గౌడ్, యువజన విభాగ అధ్యక్షుడు బీసీ శివకుమార్ పాల్గొన్నారు. టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శులు బసాపురం నా గేష్ ముదిరాజ్, రమేష్ యాదవ్, మెదక్ జి ల్లా అధ్యక్షుడు హిమాపురం యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి.