23-08-2025 08:08:03 PM
లారీ డ్రైవర్లు ఇష్టారాజ్యం
బిజెపి మండల అధ్యక్షులు రావుల జానకి రావు
మంగపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఇసుక క్వారీల నుండి ప్రతి రోజు వందలాది లారీలను రోడ్లపై నిలుపుతూ క్వారీ యజమానులు ప్రజలను ఇబ్బందికి గురచేస్తున్నారని భారతీయ జనతా పార్టీ మంగపేట మండల అధ్యక్షులు రావుల జానకి రావు ఆరోపించారు. ఇసుక లారీలను నియంత్రించి లారీ డ్రైవర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసి క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలని మంగపేట తహసీల్దార్ తోట రవీందర్ కు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు.