24-08-2025 12:13:15 AM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి అజీమ్ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ కాంగ్రెస్ భవన్ లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని ఉమ్మడి వరంగల్ జిల్లా దివ్యాంగుల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. దివ్యాంగులు పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఉమ్మడి వరంగల్ జిల్లా దివ్యాంగ నాయకులతో ఒక సమావేశం ఏర్పాటుచేసి సమస్యలను పరిష్కరిస్తానని తెలపడం జరిగింది.