23-08-2025 08:09:52 PM
సిపిఎస్ రద్దు చేసే వరకు విశ్రమించబోము
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కుTPUS కామారెడ్డి జిల్లా శాఖ తరపున శనివారం రోజున కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా TPUS జిల్లా అధ్యక్షులు పుల్గం రాఘవరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దుచేసి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర బాధ్యులు మ్యాక రామచంద్రం, జిల్లా బాధ్యులు, లక్ష్మీపతి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.