24-08-2025 12:22:05 AM
గిన్నిస్ రికార్డ్ ప్రయత్నం
కరీంనగర్,(విజయక్రాంతి): ప్రజాపిత బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం రెండవ ముఖ్య సంచాలకులు కీర్తిశేషులు రాజయోగిని దాది ప్రకాశ్ మణి 18వ స్మృతి దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రహ్మా కుమారిస్ సమాజ సేవ ప్రభాగం ఆధ్వర్యంలో శనివారం స్థానిక బ్రహ్మకుమారిస్ సేవా కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్త దానం చేశారు.
దాది ప్రకాష్ మణి స్మృత్యర్థం
బ్రహ్మకుమారిస్ దేశవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు.ఈ ఈ శిబిరాల ద్వారా అత్యధిక సంఖ్యలో రక్తం యూనిట్లను సేకరించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాది ప్రకాష్ మణి సంస్థ సంస్థాపకులైన ప్రజాపిత బ్రహ్మ బాబా 1969లో దేహయాత్ర చాలించినప్పటి నుండి 2007 ఆగస్టు 25వ తారీకు వరకు సంస్థ రెండవ ముఖ్య సంచాలికగా సంస్థ అభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా సంస్థ సేవా కేంద్రాల స్థాపనకు ఎనలేని కృషి చేశారు. వీరి స్మృతి దినము ప్రతి సంవత్సరము విశ్వ బంధుత్వ దినోత్సవంగా బ్రహ్మకుమారిస్ నిర్వహిస్తూ వస్తున్నారు.
25న ఎస్ఆర్ఆర్ కళాశాలలో..
ఈనెల 25న ఎస్ఆర్ఆర్ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బికే విజయలక్ష్మి తెలిపారు. ప్రతి ఏటా ఎంతోమంది రోగులు, ప్రమాదాలకు గురైన వారు సకాలంలో రక్తం అందుబాటులో లేక మరణిస్తున్నారని, అటువంటి వారిని ఆదుకోవడానికి రక్త దాన కార్యక్రమం తోడ్పడుతుందని కరీంనగర్ బ్రహ్మ కుమారి శాఖల సంచాలిక బి కే విజయ్ తెలిపారు. ఈ నెల 25న జరిగే రక్తదాన శిబిరంలో స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తమ సంస్థ తరఫున సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందన్నారు.