calender_icon.png 24 August, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనుషులు, పశువులు, ప్రకృతికి ఒక్కటి చేసే పండుగ...

24-08-2025 12:09:53 AM

జిల్లా కలెక్టర్ రాజర్షి షా....

అంగరంగ వైభవంగా అధికారిక పొలాల మహోత్సవం...

ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని తాంసి మండల కేంద్రంలో చారిత్రాత్మిక ఘట్టం ఆవిస్కృతమైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో అధికారికంగా పోలాల పండగ వేడుకల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్  ముఖ్య అతిథులుగా హాజరుకగా, ప్రొఫెసర్ తిరుమల్ రావ్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఆద్వర్యంలో శనివారం అధికారికంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిధులను గ్రామస్తులు సంప్రదాయ మేళతాళాలతో, ఘన స్వాగతం పలికారు.

జ్యోతి ప్రజ్వలన చేసి పండుగకు శుభారంభం చేశారు. అనంతరం కార్యక్రమ నిర్వహణకు మూల కారణమైన  ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు జ్ఞాపికను అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంచి అలంకరణలతో ఉన్న ఎద్దులను గుర్తించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ... ఈ పండుగలు గ్రామీణ జీవన శైలిలోని సంప్రదాయాలను, వ్యవసాయానికి ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించేవని అన్నారు.

జిల్లాలో జరుగుతున్న వేడుకను రాష్ట్ర పండగ నిర్వహణ కోసం కృషి చేస్తామన్నారు.  పండుగ ప్రాశస్త్యాన్ని నలుదిశలా చాటిచెప్పేలా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేలా ఘనంగా నిర్వహించుకున్నామని, వచ్చే ఏడాది ఆదిలాబాదు నుండే కాకుండా హైదరాబాదు నుండి పర్యాటకులు వచ్చేలా పొలాలను రాష్ట్ర పండుగగా జరుపుకునేందుకు కృషి చేయాలి అన్నారు. ఆదిలాబాదు జిల్లాకు వందల ఏళ్ల చరిత్ర ఉందని, ఈ పండుగ రైతులు, పశువులు ప్రకృతితో ఉన్న ప్రేమ ఆప్యాయత అనురాగాల తెలియజేస్తుందన్నారు.