23-08-2025 08:05:54 PM
బాన్సువాడ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సీపీఎస్ ను రద్దు చేస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆరోపించింది. సుమారు 20 నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో, ఆగస్టు 23 శనివారం ఉపాధ్యాయులకు చీకటి రోజుగా భావిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub-Collector Kiranmayi)కి టీపీయూఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.