calender_icon.png 24 August, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురవరం అంత్యక్రియలు నేడు

24-08-2025 12:25:52 AM

-అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం ఆదేశం

-ముఖ్దూం భవన్‌లో నివాళులర్పించనున్న సీఎం రేవంత్, మంత్రులు

-గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం భౌతికకాయం 

-ముఖ్దూం భవన్ నుంచి ఆస్పత్రి వరకు అంతిమయాత్ర

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): నిరాడంబర జీవితానికి, సైద్ధాంతిక నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన సీపీఐ అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి (83) అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ నుంచి ఆయ న భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ర్ట కార్యాలయం ‘మఖ్దూం భవన్’కు తరలిస్తారు. అక్కడే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నివాళులర్పిస్తారు.

అనంతరం సురవరం భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు. కాగా సురవరం సుధాకర్‌రెడ్డి.. మరణానంతరం కూడా తన దేహం సమాజ హితానికే, భవిష్యత్ వైద్య తరాల విజ్ఞానానికే ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఆయన ఆశ యాలకు అనుగుణంగా కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆయన భౌతికకాయాన్ని ఆదివారం గాంధీ మెడికల్ కాలేజీకి దానం చేయనున్నారు.

సురవరం అంతిమ వీడ్కో లు కార్యక్రమ వివరాలను సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 9 గంటలకు గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో హి మాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ర్ట కార్యాలయం ‘మఖ్దూం భవన్’కు తరలిస్తారు. ఉద యం 10 గంటల నుంచి మ ధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.

మధ్యాహ్నం 3 గంటల కు అశ్రునయ నాల మధ్య మఖ్దూం భవన్ నుంచి గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతి మ యాత్ర ప్రారంభమవుతుంది. సాయం త్రం 5 గంటలకు అంతిమ యాత్ర గాంధీ మెడికల్ కాలేజీకి చేరుకున్న అనంతరం, వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహాన్ని కాలేజీ యాజమాన్యానికి అధికారికంగా అప్పగిస్తారు.

పీడిత వర్గాల కోసమే కృషి:కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సౌమ్యుడు, మృదుస్వభావి, పీడిత వర్గాల అభివృద్ధి కోసం తుది శ్వాస వరకు పనిచేసిన నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి. సామా న్య కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి జాతీయ పార్టీకి కార్యదర్శిగా పనిచేయడం ఆయన పనితనానికి నిదర్శనం. తెలుగు వారికి గర్వకారణం. 

పేదల అభ్యున్నతికిపాటుపడిన నాయకుడు:కేంద్ర మంత్రి బండి సంజయ్

నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడిన నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి. సురవరం సుధాకర్‌రెడ్డి మృతి విచారకరం. సౌమ్యుడు, మృధుస్వభావి, అందరితో కలిసి మెలిసి ఉంటూ నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన నాయకుడు సుధాకర్‌రెడ్డి. తెలంగాణకు చెందిన సురవరం సుధాకర్‌రెడ్డి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం గొప్ప విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. 

ప్రజాస్వామ్య వాదులకు లోటు: మంత్రి సీతక్క

సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి మృతి ప్రజాస్వామ్యవాదులకు తీరని లోటు. నిత్యం ప్రజా సంక్షేమం కాంక్షించిన సైద్ధాంతిక నిబద్ధుడిని కోల్పోవడం అత్యంత బాధాకరం. కొండ్రవుపల్లి వంటి మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయిలో సీపీఐ ప్రధాన నేతగా ఎదిగిన సుధాకర్‌రెడ్డి అనేక ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నడిపిన అసామాన్య కమ్యూనిస్టు నాయకుడు. 

నిజాయితీకి మారుపేరు సురవరం

-హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్సభ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల హర్యానా మాజీ గవర్నర్ బం డారు దత్తాత్రేయ శనివారం  తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. విద్యార్థి నాయకు నిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారని, నల్గొండ లోక్ సభ సభ్యునిగా పార్లమెంటులో చురుకైన పాత్ర పోషించి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిం చారన్నారు.

వారు లోతై న జ్ఞానమున్న నాయకులని, నీతి నిజాయితీకి మారుపేరని  దత్తాత్రేయ  పేర్కొన్నారు. సిద్ధాంత వైరుధ్యం ఉన్నప్పటికీ  సురవరం సుధాకర్ రెడ్డి విమర్శలు సున్నితంగా చేసేవారన్నా రు.  అనేక విషయాలపై తనతో చర్చించి సమాధానం వారు కూడా సూచించేవారని, తాను ఆహ్వానించినప్పుడు అనేక సార్లు అలై బలై కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.

ఆయన తనకు అత్యంత సన్నిహితులని, తాను ఒక మంచి మిత్రు ణ్ణి కోల్పోయానని వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని  దత్తాత్రేయ   గుర్తు చేసుకున్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మృతిపట్ల తన ప్రగాఢ సంతాపాయాన్ని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలన్నారు.  వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ  పేర్కొన్నా రు. ఈయనతో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ దినపత్రిక  సంపాదకులు  దేవులపల్లి అమర్ పాల్గొన్నారు.