calender_icon.png 24 August, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ క్రీడ దినోత్సవాన్ని ప్రారంభించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ

24-08-2025 12:16:25 AM

అన్ని క్రీడలను ఒకే మైదానంలో చూడాలి... డాక్టర్ యుగంధర్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరపాలక సంస్థ పాల్వంచ డివిజన్ శ్రీనివాస్ కాలనీ మినీ స్టేడియంలో శనివారం జాతీయ క్రీడలను  ట్రైన్ కలెక్టర్ సౌరబ్ శర్మ ప్రారంభించారు. రాష్ట్ర యువజన, క్రీడ శాఖ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పిలుపు మేరకు ఈనెల 23 నుండి 31 వరకు 9 రోజులు పాటుగా జాతీయ క్రీడ పోటీలను మండల స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు తెలియజేశారు.

ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాలలో క్రీడలు నిర్వహించాలని ఆటల వల్ల విద్యార్థులకు మంచి ఆరోగ్యాన్ని కలుగుతుంది అన్నారు. మన జిల్లా నుండి  స్పోర్ట్స్ కు మన జిల్లా కలెక్టర్ అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నారని, అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్స్ వారు ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అన్ని వేళలో మీకు సహకార అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం జాతీయ క్రీడ వేడుకలను మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

శ్రీనివాస్ కాలనీ మినీ స్టేడియంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొన్ని క్రీడా ప్రాంగణాలను పెంచుకోవడం పట్ల జిల్లా కలెక్టర్కు, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారికి అభినందనలు తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో మరిన్ని క్రీడా మైదానాలు బ్యాట్మెంటన్ రైఫిల్ షూటింగ్ రన్నింగ్ ట్రాక్ వివిధ క్రీడలను ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను. ఉదయాన్నే క్రీడా మైదానాలకు వచ్చే పిల్లలకు క్రమశిక్షణ, అంకిత భావం, చురుకైన ఆలోచన విధానాలు మెండుగా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.