11-10-2025 01:39:41 AM
హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిన 22 మంది ఏఐసీసీ పరిశీలకులు శనివారం తెలంగాణకు రానున్నారు. పరిశీలకుల బృందంలో వి. నారాయణస్వామి, సీపీ జోషి, శక్తిసిన్హాగోయెల్, బెన్ని బెహనాన్, ఏ.ఆంటోని, హిబి హెడెన్, సజరిత్, శోభాహాజా, బీవీ శ్రీనివాస్, అజయ్‌సింగ్, రిజ్వాన్ ఆర్శద్, టి. సిద్ధిఖ్, సోఫియాపెర్డాస్, శ్రీనివాస్‌మనే, అమీన్ పటేల్, ఎం. నారాయణస్వామి, శరత్‌రౌతు, బిశ్వరంజన్ మోహంతి, నభ్యజ్యోతి పట్నాయక్, దెబాసిస్ పట్నాయక్, జాన్సన్ అబ్రహం, కె. మహేంద్రన్ ఉన్నారు.
వీరితో పీసీసీ అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ సమావేశం నిర్వహించి.. జిల్లా అధ్యక్షుల నియామయంలో అనుసరించే వ్యూహాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ పరిశీలకులు వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లి పార్టీ పదవుల నియామకానికి సంబంధించి చర్యలు తీసుకోకున్నారు.