calender_icon.png 7 January, 2026 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంప్లీట్ ఎంటర్ టైనర్ క్రేజీ కల్యాణం

06-01-2026 01:07:35 AM

నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ’రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ’క్రేజీ కల్యాణం’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై బూసమ్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

భద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు. ’ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాలకు సంగీతం అందించిన సురేశ్ బొబ్బిలి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నారు.