calender_icon.png 3 August, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ సంబంధం అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి

02-08-2025 10:28:21 PM

 తిరుమలగిరి: మహిళతో వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నదనే అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన మండలంలోని నాయకుని తండాలో చోటుచేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడవిదేవులపల్లి మండలం బాలాజీ తండాకి చెందిన సపావత్ రమేష్ తండ్రి రూప్ సింగ్ దీంతో పాటు నాయకుని తండా గ్రామానికి చెందిన సదరు మహిళను ఇద్దరిని నాయకుని తండాలో మహిళ యొక్క కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు వారి ఇరువురిని స్తంభానికి కట్టివేసి కొట్టినారు. ఇట్టి విషయంలో సపావత్ రమేష్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తిరుమలగిరి ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు.