calender_icon.png 9 May, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పిన ఆర్మీ జవాన్లకు అభినందనలు

09-05-2025 01:48:17 AM

జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్

జగిత్యాల అర్బన్, మే 8 (విజయ క్రాంతి): పహేల్గాం హత్యాకాండ కు ప్రత్యేకంగా పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలపై దాడులను విజయవంతంగా నిర్వహించిన భారత ఆర్మీ జవాన్లకు అభినందనలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు.

తెలంగాణ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భారత జవాన్లకు సంఘీభావంగా ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ కు మన భారతదేశం గట్టి బుద్ధి చెప్పడం భారతీయులందరికీ గర్వకారణం అన్నారు.

సామాన్య ప్రజలకు ఆస్తులకు నష్టం వాటిల్లకుండా కేవలం తీవ్రవాద శిక్షణ శిబిరాలనే లక్ష్యంగా చేసుకొని వాటిని సమర్థవంతంగా ధ్వంసం చేసిన భారత ఆర్మీ జవాన్ల సామర్థ్యాన్ని కొనియాడారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతదేశానికి, భారత సైన్యానికి ప్రతి భారతీయుడు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్, టీజీఈ జేఏసీ నాయకులు నాగేందర్ రెడ్డి, కందుకూరి రవిబాబు, గంగరాజం, హరికిరన్, అరుణ, ఆనందరావు, అమరేందర్ రెడ్డి, రాజేశం, శ్రీనివాస్ గౌడ్, వకీల్, హకీమ్, అశోక్ రాజు, పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, పెన్షనర్లు  పాల్గొన్నారు.