calender_icon.png 4 October, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ కిక్కు..!

04-10-2025 01:01:40 AM

- దసరా సందర్భంగా భారీగా అమ్ముడైన మద్యం

- డ్రై డే కి ముందే మద్యాన్ని కొని  దాచుకున్న మందుబాబులు

- రెండు రోజుల్లో రూ.23.34 కోట్ల అమ్మకాలు

ఖమ్మం, అక్టోబరు 03 (ఖమ్మం):తెలంగాణలో దసరా పెద్ద పండుగ బీద బిక్కి నుం చి ఆర్థికంగా ఉన్న వారి వరకు తప్పకుండా జరుపుకునే పండుగ. ఇక మద్యం మాంసం తప్పనిసరి. అయితే ఈ ఏడాది గాంధీ జ యంతి, దసరా ఒకేరోజు వచ్చాయి. గాంధీ జయంతిని ప్రభుత్వం డ్రై డే పాటిస్తుంది కా బట్టి మద్యం మాంసం దొరకని పరిస్థితి.

దీని వల్ల సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇ బ్బంది లేకపోయినా, మందుబాబులకు మా త్రం కాస్త ఇరకాటం కలిగించింది. ఈ పరిస్థితిని ముందుగానే పసికట్టిన మందుబాబు లు, డ్రైడే కి ముందుగానే మద్యాన్ని కొని దా చుకొని పండుగ నాడు సంబురం చేసుకున్నారు. దసరాకి రెండు రోజుల ముందు జి ల్లాలో మద్యం అమ్మకాలు ఏకంగా రూ. 23.34 కోట్లుగా నమోదయిందంటే మందు బాబులా ముందుచూపు ఏ స్థాయిలో ఉం దో అర్థం చేసుకోవచ్చు. 

ఆ రెండు రోజుల్లో..

హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. మద్యం మాంసం లేకుండా పండుగ జరుపుకునేందుకు అక్కడి ప్రజలు ఇష్టపడరు. గాంధీ జయంతి దసరా ఒకే రోజున వ చ్చాయి కాబట్టి, సెలవును అక్టోబరు 3వ తేదీకి మార్చాలంటూ కొంతమంది రాష్ట్ర ప్ర భుత్వానికి లేఖలు కూడా పంపించారు. జిల్లాలో మాత్రం ఈ పరిస్థితి కాస్త తక్కువ అని, ఆధ్యాత్మికతకు కాస్త ఎక్కువ ప్రాము ఖ్యం ఉంటుందనే అభిప్రాయం ఉంది.  కానీ, ఈ దసరాకు జిల్లాలో జరిగిన మద్యం అమ్మకాలను పరిశీలిస్తే ఇక్కడి వారు కూడా మద్యంతోనే దసరాను ఘనంగా జరుపుకున్నట్టు తెలుస్తోంది. 

డ్రైడే నాడు మద్యం దుకాణాలు ఉండవు కాబట్టి దసరా పండుగ రెండు రోజుల ముందు నుంచే మద్యం బాబులు తమకు కావాల్సిన మందు కోసం దుకాణాల ముందు బారులు కట్టారు. సెప్టెంబర్ 30న ఏకంగా 22.5 కోట్ల మద్యం అ మ్మకాలు సాగగా, మరునాడు అక్టోబర్ 1న కేవలం రూ 84 లక్షల అమ్మకాలు సాగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ముందు రోజు భారీగా అమ్మకాలు సాగటం, మరునాడు పండుగ హడావిడి ఉండడంతో అక్టోబరు 1న అమ్మకాలు తగ్గాయాన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సాధారణంగా జిల్లాలో నెలకు  సుమారు రూ. 185 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతాయి.  అంటే రోజుకు రూ. 6 కోట్ల నుంచి రూ. 7  కోట్లు అని అంచనా వేసుకోవచ్చు ఈ లెక్కన పం డుగ ముందు రెండు రోజుల్లో జరిగిన అమ్మకాలు సాధారణం కంటే నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.  దీనిని బట్టి మందు బాబులు  పండుగ నాడు ఏ స్థాయిలో మద్యాన్ని తాగేశారో అర్థం చేసుకోవచ్చు. 

గతేడాదితో పోల్చుకుంటే..

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దసరా పండుగకు మద్యం అమ్మకాలు దా దాపు ఆరేడు శాతం అధికంగా జరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం కూడా దండిగానే సమకూరింది.  ఇక డ్రై డే అంటూ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించినా,  మద్యం అమ్మకాలు దొంగదారుల్లో విచ్చలవిడిగా సాగాయన్న విమర్శలు వ్యక్తం అవు తున్నాయి.  మాంసం దుకాణాలు బహిరంగంగా కనిపిస్తాయి కాబట్టి, నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మేవారి పై  చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

మద్యం చాటుగా అమ్మటంతో, అక్రమ మద్యం అమ్మకం దారుల పై చర్యలు తక్కువ.  అధికారులు కాస్త గట్టిగా నిఘా పెడితే డ్రై డేన అక్రమంగా మందు అమ్మే వారిపై చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద పండుగ రోజున డ్రై డే వచ్చినప్పుడు ప్రభు త్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని పరిస్థితుల్లో, దొంగదారుల్లో మద్యం  కొనక తప్పదనే భిన్నమైన అభిప్రాయం మందుబాబుల నుంచి వ్యక్తం అయింది. మొత్తానికి ఈ దసరా అటు ముందు బాబులకు,  ఇటు ఎక్సైజ్ శాఖకు ఎక్కు ఇచ్చింది అన్నది మాత్రం వాస్తవం.