18-05-2025 12:21:21 AM
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబా ద్, మే 17 (విజయక్రాంతి): ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించేందుకు ఏ ర్పాటు చేసిన ఎంపీల కమిటీపై కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు దారుణం గా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మండిపడ్డారు.
ఈ కమిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ విదేశాంగ నిపుణుడు, అంతర్జాతీయ వ్యవహారాల్లో విశేషమైన అనుభవమున్న శశిథరూర్‌ను తమ ప్రభుత్వం సభ్యుడిగా చేర్చడం పై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తప్పుపట్టడం సరికాదని శనివారం ప్రకట నలో తెలిపారు. ఇండియా సమస్యను అంతర్జాతీ యంగా వివరించేందుకు పార్టీల కతీతంగా శశిథరూర్‌ను తాము ఎంపిక చేసినా వ్యతిరేకంగా మాట్లాడటం తగదన్నారు.