calender_icon.png 18 May, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అచ్యుత సామంత కృషి ఆదర్శం

18-05-2025 12:58:30 AM

-తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ 

- ఆర్ట్ ఆఫ్ గివింగ్- ఏవే ఆఫ్ లైఫ్ పుస్తకావిష్కరణ

ఖైరతాబాద్, మే 17 (విజయక్రాంతి): సామాజిక పరివర్తన కోసం ప్రొఫెసర్ అచ్యుత సామంత చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. శనివారం 12వ అంతర్జాతీయ ఆర్ట్ ఆఫ్ గివింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ గంటా చక్రపాణి, మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దామోదర్, సీనియర్ పాత్రికే యులు వెంకట్ నారాయణ, కే శ్రీనివాస్, దిలీప్‌రెడ్డిలతో కలసి ప్రొఫెసర్ అచ్యుత సమంతా రచిం చిన ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్- ఏవే ఆఫ్ లైఫ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లా డుతూ.. ఆర్ట్ ఆఫ్ గివింగ్ అనేది మానవత్వం, దయ, సమాజ సేవలను ప్రోత్సహించే జీవనతత్వం అన్నారు.

ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ అచ్యుత సామంత 2013 మే 17న ఈ ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. సమంత సామాన్య నిరుపేద కుటుంబం లో జన్మించి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఎన్నో కష్టాలను అనుభవించారని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో పరివర్తన తీసుకురావచ్చని గిరిజన, వెనుకబడిన తరగతుల పిల్లల జీవితాలను మార్చేం దుకు అనేక ఇన్‌స్టిట్యూట్లను స్థాపించి ఉచిత వి ద్య, ఆహారం, వసతులను కల్పించి వారి జీవితా ల్లో మార్పు తెచ్చారని కొనియాడారు.

అచ్యుత సామంత ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలా ది మం దికి ఉపాధి కల్పించారని తెలిపారు. అచ్యుత సా మంత రూపొందించిన ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రపంచాన్ని మరింత గొప్పగా మార్చేందుకు కృషి చేయాలన్నారు.