06-08-2025 07:24:31 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కాటారం మండల కేంద్రంలో తెలంగాణ సంస్కృత సారథి సింగం శిరీష కళా బృందం ఆధ్వర్యంలో బుధవారం ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల సమస్యల పైన అనేక పాటలు రాసి ప్రజల్ని చైతన్యపరిచిన గద్దర్ అన్న ఆశయాలను కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు.
శిరీష మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను పాటల రూపంలో ప్రజల వద్దకు తెలంగాణ సంస్కృత సారథి కళాకారులు చేర్చడంలో ముందు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతిక సారథి కళా బృందం కళాకారులు కమ్మల ప్రవీణ్ కుమార్, జాడి సుమలత, పులి రాధిక, గడ్డం నాగమణి, కాస్త స్వాతి ఓనపాకల కుమార్, ఆత్మకూర్ మహేందర్, చిలుముల మధుబాబు ప్రజలు కళాకారులు పాల్గొన్నారు.