calender_icon.png 6 August, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు

06-08-2025 07:30:50 PM

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండల వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో తెలంగాణ ఉద్యమ దిక్సూచి, సామాజిక ఉద్యమకారులను ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన మార్గదర్శి జయశంకర్ సార్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ లాలూ నాయక్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జానయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రాజేష్, ఎంఆర్సిలో ఎంఈఓ నకరికంటి రవి అలాగే ఆయా ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఆయా శాఖల అధికారులు కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాధా, ఆర్ ఐ రంజిత్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.