06-08-2025 07:22:39 PM
ఆయన సేవలు మరువలేనివి..
మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్..
చిగురుమామిడి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆజన్మాంతం పోరాటం చేసి తన జీవితాన్ని తెలంగాణకే అంకితం చేసిన దార్శినికుడు ఆచార్య జయశంకర్ అని జెడ్పి మాజీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ కొనియాడారు. చిగురుమామిడి మండల(Chigurumamidi Mandal) కేంద్రంలో మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీకురు రవీందర్ మాట్లాడుతూ... నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాదులు వేసిన గొప్ప దార్శనికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన జీవితాన్ని తెలంగాణకే అంకితం చేసి తెలంగాణ జాతిపితగా వెలుగొందిన మహనీయుడు జయశంకర్ సార్ అని, తెలంగాణ తొలి ఉద్యమ కాలంనాడే నాన్-ముల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమాలతో తెలంగాణలో నిప్పు రాజేసి, మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఏర్పాటుకు దశా దిశా నిర్దేశించిన సైద్యంతిక వాది అని గీకురు రవీందర్ పేర్కొన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలలో వివక్షత లేని సామాజిక తెలంగాణ కోసం నిరంతరం పోరాడారన్నారు. ఆచార్య జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తూ, సమాజంలో అంతరాలు లేని సామాజిక తెలంగాణ కోసం పాటుపడి, తాను కన్నా కలలను నిజం చేయడానికి ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి సదాచారి, ఉపాధ్యక్షుడు అనువోజు బాలకృష్ణమాచారి, విశ్వకర్మ నాయకులు చొప్పదండి సుధాకర్, అనువోజు చిరంజీవి, ఇంద్రయ్య, గొల్లపెల్లి తిరుపతయ్య, కందుకూరి సత్యనారాయణ, శ్రీరామోజు రాములు, వడ్లురి రాజయ్య, వడ్లూరి నరేష్, చొప్పదండి రాజయ్య, సాయి కృష్ణ, భరత్, బహుజన నాయకులు కూతాడి కొమురయ్య, నిలిగొండ కిషన్, పెనుకుల తిరుపతి, వేల్పుల సదానందం, మార్క రాజ్ కుమార్, మల్లం బాలయ్య, రాజయ్య, వెంకటరాజం, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.