06-08-2025 12:44:40 AM
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్‌లో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా అలగు వర్షిణిని కేంద్రం నియమిస్తూ.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి నాలుగు సంవత్సరాలపాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు తపదవిలో కొనసాగనున్నారు. ఈ ఉత్తర్వులు జారీ చేసిన మూడు వారాల్లోపు ఆమె ఆ పదవిలో చేరాల్సి ఉంటుంది.