06-08-2025 07:35:03 PM
మూడు రోజుల్లో ఆసుపత్రి మూసివేయాలని జిల్లా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ విద్య ఆదేశం..
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రి(SevenHills Hospital) అనుమతులు రద్దు చేస్తున్నట్లు బాలుడి మృతి చెందిన ఘటనలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి అనుమతులు రద్దు చేస్తున్నట్లు డిప్యూటీ డిఎంహెచ్వో విద్య తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో ఇటీవల బాలుడిని చేర్పించగా చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేయడంతో మృతి చెందాడు. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. విచారణలో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం తేలింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఆస్పత్రి అనుమతులు రద్దు చేస్తున్నట్లు సంబంధిత యాజమాన్యానికి నోటీసులు అందించారు. బాధ్యతా రహితంగా వ్యవహరించినందుకు మూడు రోజుల్లో ఆస్పత్రి మూసివేయాలని నోటీసులో పేర్కొన్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో విద్య తెలిపారు.