calender_icon.png 29 January, 2026 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి

29-01-2026 01:26:01 AM

  1. పెద్దపల్లిలో మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి 
  2. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు

మంథని, జనవరి 28 (విజయక్రాంతి): పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మున్సిపాలిటీల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్ మాజీ జడ్పీటీసీ ఐల రమేష్ తన భారీ అనుచర గణంతో మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరా రు.    మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యం గా ఎమ్మెల్యే విజయరమణారావు పనిచేస్తున్నారని చెప్పారు.

మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేసి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరిచేలా సహకరించాలన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయిస్తామని, ఆశవాహులు నిరాశ చెందకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

మరో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంటుందని కార్యకర్తలు ఎవరు నిరాశ చెందకుండా మున్సిపాలిటీలలో పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగిరేసేలా సహకరించాలని సూచించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలంలో పెద్దపల్లిలో 63 కోట్లు, సుల్తానాబాద్ 15 కోట్ల రూపాయలతో అభివృద్ధిపరిచామని తెలిపారు.

పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు మినుపాల ప్రకాష్‌రావు, ఈర్ల స్వరూప, సారయ్యగౌడ్, సాయిరి మహేందర్, ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ చీకట్ల ముండయ్య పాల్గొన్నారు.