calender_icon.png 29 January, 2026 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంపన్నవాగులో విషాదం!

29-01-2026 01:24:12 AM

  1. వరుదలో కొట్టుకుపోయిన భక్తుడు

మృతదేహం వెలికితీసిన ప్రత్యేక బృందాలు

ములుగు/మేడారం, జనవరి 28 (విజయక్రాంతి): ములుగు జిల్లా మేడారం మహాజాతర మొదటి రోజే విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం జంపన్నవాగులో స్నానం కోసం దిగిన ఓ భక్తుడు నీటి ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన కిరణ్(45) కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమ్మవార్ల దర్శనానికి మేడారం వచ్చాడు.

జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించేందుకు వాగులోకి దిగి నీటిలో గల్లంతయ్యాడు. కళ్లముందే జరిగిన ఘటనతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల భక్తులు షాక్‌కు గురయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గంటల తరబడి జంపన్నవాగులో గాలించి, మృతదేహాన్ని వెలికితీశాయి. జంపన్నవాగులో కొన్ని చోట్ల లోతు పెరగడం, ప్రవాహం తీవ్రత బలంగా ఉండటమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.