calender_icon.png 29 January, 2026 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెప్ట్‌తో స్నేహ హస్తం!

29-01-2026 12:32:25 AM

  1. పురపోరులో అధిక స్థానాలే లక్ష్యంగా వ్యూహం   
  2. ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం
  3. స్థానికంగానే సీట్ల సర్దుబాటు చేసుకోవాలని కేడర్‌కు సూచన
  4. పొత్తు ధర్మానికి విఘాతం కలిగించొద్దన్న అధిష్ఠానం
  5. ఎన్నికల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దని.. రెబల్స్‌ని నియంత్రించాలని ఆదేశాలు

హైదరాబాద్, నవరి 28 (విజయక్రాంతి) : పురపోరులో అధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను హన్తగ తం చేసుకోవాలని అధికారపార్టీ వూహాలను రచిస్తోం ది. అందులో భాగంగానే వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే,  పురపోరు పొత్తుల విషయంలో రాష్ట్ర స్థాయి లో కాకుండా స్థానికంగానే సీట్ల సర్దుబాటు చేసుకోవాలని పార్టీ నేతలకు కాంగ్రెస్ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసింది.

పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న స్థానా లు దక్కలేదని, మున్సిపోల్స్‌లో మెజార్టీగా హస్తగతం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి నడవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 

మున్సిపోల్స్‌లోనూ పంచాయతీ సూత్రం

ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌తో పాటు కరీంనగర్ జిల్లాల్లోని పలు పట్టణాల్లో కొన్ని చోట్ల వామపక్ష పార్టీలకు  బలమైన క్యాడర్ ఉన్నది. ఇప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ ( సీపీఐ ) కాంగ్రెస్ పార్టీ కి మిత్రపక్షంగానే  ఉన్నది. ఇక  సీపీఎం తటస్థంగానే ఉంటోంది.  ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నిక ల్లో కొన్ని చోట్ల వామపక్షాలు స్థానిక పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే సూత్రం పాటించాలనే నిర్ణయానికి అధికార పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. 

రెబల్స్ బెడద నియంత్రించాలని..

ఇదిలా ఉంటే  వార్డుల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, పోటీ ఎక్కువగా ఉన్న చోట బుజ్జగింపులు చేపట్టి రెబల్స్ బెడద లేకుండా చూడాలని పార్టీ నేతలకు పీసీసీ ఇప్పటికే  సూచనలు చేసింది. వామపక్ష పార్టీలతో  ఎక్కడైనా పొత్తులు కుదిరిన చోట.. కాంగ్రెస్ నుంచి రెబల్స్ బరిలోకి దిగకుం డా చూసుకోవాలని సూచించింది. రెబల్స్ అభ్యర్థులు బరిలో ఉంటే.. పొత్తు ధర్మానికి విఘాతం కలుగుతుందనే భయం కూడా అధికార కాంగ్రెస్‌ను వెంటాడు తోంది. 

ఇక పార్టీ పరంగా అభ్యర్థుల ఎంపిక విషయం లో పార్లమెంట్ నియోజక వర్గాలకు ఇన్‌చార్జ్‌గా నియమించిన మంత్రితో పాటు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మె ల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సమన్వయంతోనే నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో నిర్లక్ష్యంగా ఉండటం వల్లే.. అనుకున్న సీట్లు సాధించలేకపోయామని, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతున్నందున అలసత్వంగా ఉండొద్దని పార్టీ నేతలకు హెచ్చరికలు చేసిన ట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇన్‌చార్జ్ మం త్రులు కూడా రంగంలోకి దిగి.. పార్లమెంట్ వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో  సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా మెజార్టీ సీట్లు సాధించాలని దిశా నిర్దే శం చేస్తున్నారు. ఒక వేళ  మున్సిపల్ ఎన్నికల్లో తక్కువ సీట్లు సాధిస్తే.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే అంశం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.