calender_icon.png 29 January, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి

29-01-2026 01:29:34 AM

  1. ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలి 
  2. బహుజన రాజ్యం రావాలని తల్లులకు మొక్కుకున్న
  3. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, జనవరి 28(విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర, తెలంగాణ రాష్ట్ర కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారంలో వెలసిన సమ్మక్క, సారక్క పండుగను తక్షణమే జాతీయ పండుగగా ప్రకటించాలనీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు. బుధవారం మేడారంలో వెలసిన వన దేవతలు సమ్మక్క సారలమ్మలను ౫౦ మంది బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులతో కలసి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ ల జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు చేర్చడానికి పాఠ్య పుస్తకాల్లో చేర్చడంతో పాటు మొత్తంగా గ్రంథస్తం చేయాలన్నారు.  కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి జిల్లా అని, భువనగిరి జిల్లాకు యాదాద్రి జిల్లా అని, గద్వాల జిల్లాకు జోగులాంబ జిల్లా అని పేరు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

తక్షణమే ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మల జిల్లాగా పేరు పెట్టాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సమ్మక్క సారలమ్మల పౌరుషం, బహుజన వర్గాలు పుణికి పుచ్చుకోవాలని వారి స్ఫూర్తితో రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైన బహుజనులకు రాజ్యాధికారం తగ్గాలని ఆ తల్లులను మొక్కుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోట్లాదిమంది తరలివచ్చే మేడారం జాతర ఏర్పాట్లు, గద్దెల నిర్మాణం అన్ని తానై దగ్గరుండి చూసుకుంటున్న సమ్మ క్క సారమ్మల వారసురాలు రాష్ట్ర మంత్రి సీతక్కకు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. సమ్మక్క సారలమ్మల ప్రతిరూపమే సీతక్క అని కొనియాడారు.

కాగా మేడారం దర్శనానికి వచ్చిన జాజుల శ్రీనివాస్ గౌడ్ బృందాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్వాగతించి శాలువాతో సత్కరించి అమ్మవార్ల ప్రసాదాలు  అందజేశారు.జాజుల శ్రీనివాస్ గౌడ్ వెంట రాష్ట్ర అధ్యక్షులు బైరి రవి కృష్ణ, గుజ్జ కృష్ణ, వరంగల్ శ్రీనివాస్, కుల్కచర్ల శ్రీనివాస్, యాదగిరి గౌడ్, తాటికొండ విక్రమ్ గౌడ్, బి మణి మంజరి, దాడి మల్లయ్య యాదవ్, నరసింహ నాయక్ వీర స్వామి, తారకేశ్వరీ, సంధ్యారాణి, శ్రీనివాస్ గౌడ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.