calender_icon.png 5 July, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఆశలను నెరవేర్చుతున్న కాంగ్రెస్

03-07-2025 01:43:07 AM

 గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి 

 గజ్వేల్, జులై2: పేదల ఆశలైన సొంతింటి కలను సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని  గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ, వర్గల్, ములుగు మండలాల్లో పలు గ్రామాల్లో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించి వేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమాలలో వంటిమామిడి ఏఎంసీ చైర్మన్  విజయ మోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్తా, గజ్వేల్ ఏఎంసి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, జిల్లా నాయకులు నిమ్మ రంగారెడ్డి, నరసింహారెడ్డి, సందీప్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, గుంటుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.