03-07-2025 01:41:42 AM
మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ నాయకుల వినతి
గజ్వేల్, జులై 2 : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోనీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ గతంలో ప్రజల నిత్యావసరాల కోసం రెండు మూడు గంటల పాటు నల్లా నీళ్లు వచ్చేవని, ప్రస్తుతం అరగంట కూడా రావడం లేదన్నారు.
ప్రజలకు ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కావున వెంటనే నీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు చేప్యాల వెంకటరెడ్డి, గజ్వేల్ బిజెపి నాయకులు నాగు ముదిరాజ్, పంజాల రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి మాడ్గురి నరసింహా ముదిరాజ్, బీజేవైఎం నాయకులు రాజేశ్వర్ చారి తదితరులు పాల్గొన్నారు.