26-09-2025 09:18:15 PM
బెజ్జంకి,(విజయక్రాంతి): బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిదాని, బతుకమ్మ చీరలను ఆడపడుచులకు అందించడంలో విఫలమయిందని బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ లింగాల నిర్మలలక్ష్మణ్ అన్నారు. శుక్రవారం పత్రిక సమాజంలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ప్రపంచానికి చాటి చెప్పాలా రాష్ట్ర పండుగగా జరుపుకున్నామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 నుంచి ప్రతి ఏడాది మహిళలకు బతుకమ్మ చీరలను కానుకగా అందించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాంప్రదాయాన్ని కొనసాగించడంలో విఫలమైందని విమర్శించారు. బతుకమ్మ పండుగకు రెండు చీరలు పంపిణీ చేస్తామని ఒకే చీర ఇస్తామా అనడం మహిళలను నిరాశకు గురిచేసిందన్నారు. మహిళా సంఘాల్లో ఉన్నవారికే ఇస్తానడం సరికాదన్నారు. అబద్దాలతో మోసం చేసి, గద్దె నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజులలో భంగపాటు తప్పదని హెచ్చరించారు.