26-09-2025 10:41:40 PM
సిర్గాపూర్/కంగ్టి/కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి స్థానిక కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ... రానున్న 48 గంటలు భారీ వర్షాల దృష్ట్యా జిల్లాకు ఎల్లో అలర్ట్. లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. పొంగిపోర్లే వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదు, దాటడానికి ప్రయత్నించకూడదన్నారు. అత్యవసర సమయంలో డైల్ 100 (లేదా) లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్త పాటించాలి.
లోతట్టు ప్రాంతాలల్లో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లరాదు. రైతులు పొలాలల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్త వహించాలి. విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాక కూడదన్నారు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లరాదన్నారు. వాగులు వంకలు బ్రిడ్జ్ లపై నుండి పొంగి, పొరలే సమయంలో దాటాడానికి ప్రయత్నించరాదన్నారు. పాడైన పాత (శితిలావస్థ) భవనాల కింద ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదని సీఐ వెంకట్ రెడ్డి అన్నారు.