calender_icon.png 17 October, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

16-10-2025 05:41:54 PM

బిఆర్ఎస్ చెన్నూరు నియోజక వర్గం ఇంచార్జ్ డా.రాజా రమేష్.. 

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల లో ఏ ఒక్క హామీని అమలు చేసిన దాఖలాలు లేవని, హామీల ఆమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని బిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ మండిపడ్డారు. పట్టణం లోని పాత బస్టాండ్ జయశంకర్ చౌరస్తాలో కాంగ్రెస్ బాకీ కార్డులను గురువారం ప్రజలకు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు 420 హామీల యును ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సం.. పూర్తి అయినప్పటికీ ఒక్కహామీ కూడా అమలు లేదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల ప్రకారం ఇప్పటి వరకు ఉన్న బాకీలను వివరిస్తూ బాకీ కార్డులు అంద చేశారు. కాంగ్రెస్ పార్టీ  మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టడంతో పాటు 8 రాష్ట్రవ్యాప్తంగా చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ యూనియన్ నాయకులు, టిఆర్ఎస్ పట్టణ ప్రజల నాయకులు వార్డు అధ్యక్షులు, యూత్ విద్యార్ధి సోషల్ మీడియా నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.