calender_icon.png 17 October, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ ప్రాంతాల డీలర్లకు న్యాయం చేయాలి

16-10-2025 05:43:38 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ప్రతినిధులు జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ను కలిసి డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రేగుంట కేశవ్ రావు, ప్రధాన కార్యదర్శి కోనేరు శేషగిరిరావు, కోశాధికారి జాడే ఆత్మ రావు మాట్లాడుతూ జిల్లాలోని రేషన్ డీలర్లకు పోర్టబిలిటీ రిక్వెస్ట్ బియ్యం మంజూరు చేయకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు.

ఇతర షాపుల కార్డుదారులకు బియ్యం అమ్ముతున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా చేయకపోతే పల్లె ప్రాంతాల డీలర్లకు ఆర్థికంగా నష్టం జరుగుతోందని తెలిపారు. రేషన్ పంపిణీ ప్రక్రియలో పట్టణాల కన్నా ముందుగా పల్లె ప్రాంతాల డీలర్లకు సరఫరా చేపట్టాలని కోరారు. ప్రస్తుతం పట్టణాలకు ముందుగా పంపిణీ జరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జాప్యం జరుగుతోందని దాంతో పేద ప్రజలకు రేషన్ అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జాడే ఆత్మ రావు, గజ్జి రవీందర్, అడ్వాన్ పెంటయ్య, సిరిసింగుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.