16-10-2025 05:39:51 PM
దౌల్తాబాద్: దుబ్బాక ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ మాసం షెడ్యూల్‌లో భాగంగా గురువారం ఇందుప్రియాల్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఎలయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు ప్రాజెక్టు పరిధిలో పౌష్టికాహారం, జంక్ ఫుడ్ నివారణ,అధిక బరువు నియంత్రణ,అన్నప్రాసన వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానికంగా లభ్యమయ్యే పౌష్టికాహార పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించాలని,గర్భిణీలు బాలింతలు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా లభించే సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
పోషణ్ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ శ్యాంసన్, సూపర్వైజర్ గిరిజ పోషకాహారం ప్రాముఖ్యతను చిరుధాన్యాల వినియోగ ప్రయోజనాలను వివరించారు. మెడికల్ ఆఫీసర్ ఆశ్లేష గర్భిణీ, బాలింతలకు వ్యక్తిగత పరిశుభ్రత,ఆరోగ్య సలహాలు అందించారు.కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్‌లో భాగంగా పిల్లలకి అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.చివరగా సరైన పోషణ–ఆరోగ్య తెలంగాణ పోషణ లోపం ఏ ఊరిలో కనిపించకూడదు అనే ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, లబ్ధిదారులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.