03-09-2025 07:47:11 PM
బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నేత కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అధ్వానంగా చూస్తుందనీ బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేతన్న పొదుపు పథకం ద్వారా అర్హులైన ప్రతి నేత కార్మికునికి న్యాయం చేయాలని జౌళి శాఖ ఉన్నతాధికారులకు ఆయన బుధవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వయిరీల పేరుతో నేతన్నలను అయోమయానికి గురి చేస్తుందని, నిజమైన అర్హులను ఈ పథకంలో చేరకుండా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆగ్రహించారు. ఈ సందర్భంగా ఆయన నల్లగొండ పట్టణంలోని స్థానిక పద్మా నగర్ కాలనీలో పవర్లూమ్ కార్మికులను కలుసుకొని మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకునేందుకు మేమంతా ఉన్నామని ఆయన భరోసా కల్పించారు.