03-09-2025 07:47:57 PM
కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి(SI Madhusudhan Reddy) బుధవారం మండల కేంద్రంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని, ఫోన్లో ఓటీపీలను ఇతరులకు చెప్పొద్దన్నారు. పిఎం కిసాన్ యోజన ఓటీపీ, కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు, సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబరు ఫోన్ చేసి ఫిర్యాదు చేయ్యలని ఎస్సై మధుసూదన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.