calender_icon.png 28 November, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కే లేదు

28-11-2025 12:56:09 AM

 ఒంటెద్దు నరసింహారెడ్డి

గరిడేపల్లి, నవంబర్ 27 : స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ముందుకు వచ్చి ఓటు అడిగే నైతిక హక్కే లేదని బీఆర్‌ఎస్ రాష్ర్ట నాయకులు, హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటె ద్దు నరసింహారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడతూ తెలంగాణ కోసం పోరాడిన పార్టీ బీఆర్‌ఎస్ అన్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా నిలిచిన శక్తులు అయిన మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి  ముగ్గురు కలిసి రాష్ర్టంలోని నీటి హక్కులను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం పని చేయడం మానేసి, అవినీతి, అక్రమాలకే ప్రాధాన్యం ఇచ్చే కాంగ్రెస్ ఈసారి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. దీక్ష దినస్ కు బీఆర్‌ఎస్ కార్యకర్తలు సమగ్రంగా, సమిష్టిగా కదిలి రావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా  అందరూ కలిసికట్టుగా పని చేయాలి  పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుగులోతు కృష్ణ నాయక్, హుజూర్నగర వ్యవసాయ మార్కె ట్ మాజీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, కె ఎల్ ఎన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, రైతు సమితి మాజీ అధ్యక్షుడు మాశెట్టి శ్రీహరి, పెండెం వెంకట రాములు, మాజీ సర్పం పెండెం వీరయ్య, కీతా రామారావు, కర్నాటి నాగిరెడ్డి, బానోత్ వెంకటేశ్వర్లు, ఫంగ వీరస్వామి,  కుక్కునూరి అంజయ్య, రేవూరి వీరస్వామి, తెలబాటి నరేష్, నల్లపాటి భాస్కర్, బొలిశెట్టి సుధీర్, మాజీ ఎంపీటీసీలు కడియం వెంకట్ రెడ్డి, కడియం స్వప్న, మేకల స్రవంతి శోభన్, ఎల్లావుల వెంకటేశ్వర్లు కడప ఇసాక్, సింగిల్ విండో డైరెక్టర్ హేమ్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు.