calender_icon.png 14 July, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ వంచిస్తోంది

13-07-2025 12:16:33 AM

-బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): మరోసారి కాంగ్రెస్ ప్రభు త్వం రాష్ట్రంలోని బీసీలను మోసం చేసేందుకు సిద్ధమైందని బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మా ట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క ల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకువస్తున్నట్లుగా గొప్పలు చెబుతున్నా, దీని ద్వారా బీసీల ఆత్మగౌరవాన్ని కాంగ్రె స్ వంచిస్తోందని ఆయన ఆరోపించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ, బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడాన్ని అంగీకరించబోమన్నారు. ఇది ము మ్మాటికీ బీసీల హక్కులను కాలరాసే కుట్ర అని విమర్శించారు. ఎ లాంటి చట్టబద్ధత లేకుండా ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేస్తామంటే న్యా యస్థానాల్లో నిలబడబోదని తెలిపారు. గతంలో తమిళనాడు, మహా రాష్ర్ట, బీహార్‌లో ఇలాంటి ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నా రు. ఆర్డినెన్స్ పేరిట చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడు తుందన్నారు.