13-07-2025 12:18:10 AM
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): తమిళనాడులో అధికారం కోల్పోతామనే భయంతోనే డీఎంకే డీలిమిటేషన్ (పునర్విభజన) ప్రక్రియపై ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా చేపట్టాల్సిన ప్రక్రియ అని.. ప్రజలందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పిం చడం తప్పనిసరి అని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. డీలిమిటేషన్ అనేది నేరుగా రాజ్యాంగం ఆధా రంగా జరిగే ప్రక్రియ అని ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టేది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
డీఎంకే ఆరోపణలు నైతికం గా, చట్టపరంగా తప్పు అని అన్నారు. ప్రజల మద్దతు కోల్పోయి, రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కదనే కుట్రతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా రని మండిపడ్డారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగంపై ప్రమాణం చే స్తాయని.. దేశానికి అవసరమైన మా ర్పులు చేసినప్పుడు అదే రాజ్యాంగాన్ని అవమానిస్తాయని సుభాష్ విమర్శించారు.