07-11-2025 01:29:57 AM
బోయినపల్లి : నవంబర్6 ( జయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కాంగ్రెస్ నేతలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. గత వారం రోజులుగా మండల కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు మంత్రి శ్రీధర్ బాబు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటి ఇంటికి వివరిస్తున్నారు. అదేవిధంగా గత పదివేలలో విఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను కూడా ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసే జూబ్లీహిల్స్ మరింత అభివృద్ధి జరుగుతుందని వారు కోరుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మాజీ జెడ్పిటిసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పులి లక్ష్మీపతి గౌడ్, బోయినపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు సంబ లక్ష్మీ రాజం, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు వరాల నరసింగంతదితరులున్నారు.