07-11-2025 01:35:54 AM
రాజేంద్రనగర్, నవంబర్ 6: రాజేంద్రనగర్‌లో మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకో వడంతో యువకుడు చనిపోయాడు. పాతబస్తీ కాలాపత్తర్‌కు చెందిన అహ్మద్ అలీ (28) శివరాంపల్లిలోని కెన్‌వర్త్ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
రాత్రి స్నేహి తుల తో కలిసి పార్టీ చేసుకున్నాడని, డ్రగ్స్ ఓవర్ డోస్ కావడం తోనే అహ్మద్మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు యువకులకు పాజిటివ్ రాగా, ఒక అమ్మాయికి నెగెటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపా రు. ఈ ఘటనపై కేసు నమోదుచే దర్యాప్తు చేస్తున్నారు.