calender_icon.png 7 November, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

07-11-2025 01:37:41 AM

ఘట్కేసర్, నవంబర్ 6 (విజయక్రాంతి): బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని కళాశాల మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన మల్లి పూజిత(22) అన్నోజిగూడలో అద్దెకు ఉంటూ అవుషాపూర్‌లోని అనురాగ్ యూనివర్సిటీ నీలిమా స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. గురువారం మ ధ్యాహ్నం భోజనానికి వెళ్లకుండా కాలేజీలో నే ఉండి, ఎవరితోనో ఫోన్లో చాలాసేపు మా ట్లాడింది. తర్వాత ఫోన్‌ను రేలింగ్‌పై ఉంచి, కాలేజీ మూడో అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడటంతో జోడిమెట్లలోని నీలిమ ఆసుపత్రికి తరలించారు. ఘట్కేసర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.