07-11-2025 12:25:07 AM
ముషీరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్‌ను తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. కమిటీలు కాదు, ఫీజు బకాయిలు ఇవ్వాలని కాంట్రాక్టర్ల నిధులు కేటా యింపునకు కమిటీలు వేసుకోండి అని ఆయ న అన్నారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం గన్‌పార్క్ వద్ద నల్ల కండువాలతో ఫీజుల బకాయిలు చెల్లించాలని విద్యార్థుల నిరసన దీక్షకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు.
ఫీజుల బకాయిలు ఇవ్వం డి చదువుకుంటాం.. కమిటీల పేర్లతో కాలయాపన చేయొద్దని విద్యార్థులు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వేముల రామకృష్ణ మాట్లాడుతూ 12వేల కోట్లు ఫీజుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం 14.75 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిప డ్డారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ ఎత్తివేసే కుట్రలో భాగంగా నే నిర్లక్ష్యం వహిస్తూ, కోతలు ఆంక్షలు కమిటీల పేర్లతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. కాలేజ్ యాజమాన్యాలు ఫీజుల బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభు త్వం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలు దివా ళా తీసాయని, అధ్యాపకులకు జీతాలు చెల్లించలేకపోతున్నారని, భవనానికి అద్దెలు కట్టలేక పోతున్నారన్నారు.
తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఫీజుల బకాయిలు చెల్లించకుంటే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని, దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ సంఘం నేతలు నందగోపాల్, ఉదయ నేత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.