07-11-2025 01:39:05 AM
ప్రచారంలో మంత్రులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా రని, ఓటమి భయంతో ఏదేదో మాట్లాడుతున్నారని, ముందు ఆయన తన చెల్లి కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాష్ర్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు.
కల్వకుంట్ల కుటుంబంలో దోచుకున్న సొమ్ము పంపకాలపై వాటాల పంచాయితీ నడుస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. జూ బ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రహమత్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రహమత్ నగర్ బస్తీల్లో సుదీర్ఘంగా పర్యటించిన కోమటిరెడ్డి, గడపగడపకు వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేయా లని అభ్యర్థించారు. అసెంబ్లీకే రాని కేసీఆర్ రెండేళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడు..
ఈ మూడేళ్లు, వచ్చే ఐదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం, అని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మొదటి టర్మ్‌లో కాళేశ్వరం పేరిట, రెండో టర్మ్‌లో ధరణి పేరిట దోచుకున్నారు. ఇప్పుడు ఆ దోచుకున్న సొమ్ము పంచుకునే వాటాల పంచా యితీ కల్వకుంట్ల కుటుంబంలో నడుస్తోంది. బీఆర్‌ఎస్ సెంటిమెంట్ మాటలు నమ్మి మోసపోవద్దు, అని జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలోనే.
మేము నిర్మించిన 14 కి.మీ. పీవీ ఎక్స్‌ప్రెస్ వే ఒక్కటి.. బీఆర్‌ఎస్ కట్టిన 50 చిన్న ఫ్లుఓవర్లతో సమానం,అని అన్నా రు. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును ఎన్నికల ముందు కేవలం 7 వేల కోట్లకే బీఆర్‌ఎస్ అమ్ముకుంది, అని కోమటిరెడ్డి తీవ్రం గా మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజలకు తమ సమస్యలు పరిష్కరించుకో వడానికి ఇది గొప్ప అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరం కలిసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి నిర్ణయించాం. కంటోన్మెంట్‌లో జరుగుతున్న అభివృద్ధికి రెట్టింపు అభివృద్ధి జూబ్లీహిల్స్‌లో చేసి చూపిస్తాం, అని మంత్రి హామీ ఇచ్చారు.
డ్రగ్ కల్చర్‌కు కేటీఆరే మూలం: తుమ్మల
రాష్ర్టంలో డ్రగ్, గన్ కల్చర్‌కు మాజీ మంత్రి కేటీఆరే మూల కారణం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపణ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ, కేటీఆర్ చేస్తున్న కాంగ్రెస్ బాకీ కార్డు ప్రచారానికి దీటుగా బదులిచ్చారు. పదేళ్ల మీ పాలనలో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యా యి.. మీరు రాష్ర్టంపై మోపిన లక్షలాది కోట్ల బాకీల సంగతేంటి.. అని తుమ్మల నిలదీశా రు.
సీఎం రేవంత్ రెడ్డి పెట్టే ఇబ్బందుల వల్లే పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలివె ళ్లిపోతున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ను తుమ్మల ఖండించారు. అది పూర్తి అవాస్తవం. రోజుకొక పారిశ్రామికవేత్త తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు, పరిశ్రమలు క్యూ కడుతున్నాయి అని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.