20-09-2025 12:00:00 AM
పినపాక, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో పెదవాగు ప్రవాహానికి ఇల్లు ప్రమాదంలో ఉన్న ఇళ్లను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. కాంగ్రెస్ యువజన సంఘం నాయకులు కోరస ఆనంద్ , కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇల్లను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎమ్మెల్యేకు బాధితుల సమస్యలు తెలియజేసి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం కాంగ్రెస్ యువజన నాయకులు ఆనంద్ మాట్లాడుతూ వరదలో పేదల ఇల్లులు కొట్టకపోవడం బాధాకర విషయం అన్నారు. గత ప్రభుత్వం వీరిని నిర్లక్ష్యం చేసిందని కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన పేదలకు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ సమస్యను ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని కల్పించారు.
అనంతరం ప్రతి ఇల్లును తిరుగుతూ వారి బాధలను తెలుసుకున్నారు. రాము అనే చిన్న సైకిల్ షాప్ నడుపుకునే వ్యక్తి ఇంట్లో నుంచి వాగు వరద ప్రవహించడం వారి కుటుంబం చాలా ప్రమాదంలో ఉండటం బాధాకర విషయం అన్నారు. 16 మంది పేదల ఇల్లులు వరద ముప్పులో ఉండటం చాలా విచారకరమైన విషయం అన్నారు.