calender_icon.png 20 September, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నో ట్రాఫిక్ రూల్స్!

20-09-2025 12:00:00 AM

ఇష్టానుసారంగా డ్రైవింగ్ పెరుగుతున్న ప్రమాదాలు 

మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రమాదాల నివారణకు అనుసరించాల్సిన కనీస పద్ధతులు కూడా పాటించకుండా అటు మోటా రు వాహనాల నిబంధనలను, ఇటు పోలీసుల ట్రాఫిక్ రూల్స్‌ను బేఖాతరు చేస్తున్న ట్లు విమర్శలు వస్తున్నాయి.  డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే వాహనాలను నడపాల్సి ఉంటుం ది.

అలాగే తాము నడుపుతున్న వాహనానికి సరైన రిజిస్ట్రేషన్ పత్రం, ఇన్సూరెన్స్, పొ ల్యూషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అలాగే బండి నడిపే వ్యక్తి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. వీటికి తోడు వాహనం రోడ్డుపై నడిపే సమయం లో సరైన ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే మహబూ బాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు రవాణా శాఖ, ఇటు పోలీసుల ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.

సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు, మైనర్లు, వృద్ధులు వాహనాలను నడుపుతూ తరచుగా ప్రమాదాలకు కారకులుగా మారుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పలు రోడ్డు ప్రమాదాల ఘటనల్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డట్టు ఆరోపణలు వస్తున్నాయి. మారిన మోటారు వాహనాల చట్టం, పోలీసు ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అన్ని రకాల ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ధరించి ఉంటేనే ప్రమాదం జరిగిన సమయంలో అవతలివారికి లేదా వాహనం నడుపుతున్న వారికి బీమా పరిహారం అందే అవకాశాలు ఉన్నాయి.

అయి నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు, సరైన వాహన పత్రాలు లేకుండా వాహనాలను నడుపుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదని నిబంధన ఉన్నప్పటికీ ముగ్గురు నలుగురు వెళ్లడం నిత్య కృత్యంగా మారింది. ఇక ఆటోలో డ్రైవర్‌తో కలిపి నలుగురు మాత్రమే ప్రయాణించాల్సి ఉండగా పదిమందికి మించి ప్రయాణిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

అలాగే  సరుకు రవాణా చేసే ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, ట్రాక్టర్లు, ట్రాలీల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నారు. దీనితో రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి పరిహారం పొందలేని పరిస్థితి. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి వాహనాలను నడపడం, ప్రమాదాల బారిన పడడం, తరువాత ఆవేదన చెందడం పరిపాటిగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

కాలం చెల్లిన వాహనాలను కూడా జిల్లా వ్యాప్తంగా వందలా దిగా వినియోగిస్తున్నట్లు విమర్శలు వస్తు న్నాయి. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తున్న ఘటనలపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. రోజు రోజు కు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యం లో వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉం డడం, హెల్మెట్ కచ్చితంగా ధరించే విధంగా చర్యలు తీసుకోవడం, ప్రమాదాల నివారణకు పోలీసులు, రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా  పాటించాలి

ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా ప్రతి వాహనదారుడు పాటించాలి. తాము నడిపే వాహనానికి పోలీస్, రవాణా శాఖ నిర్దేశించిన విధంగా సరైన పత్రాలు కలిగి ఉం డాలి. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపా యం నుండి తప్పించుకోవడానికి కచ్చితంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. సరైన పత్రాలు లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి కారకులైతే చట్టపరమైన చర్యలకు గురికావడంతోపాటు ఎటువంటి పరిహారం లభించని పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రతి వాహనదారుడు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాల నివారణకు పోలీసులు, రవా ణా శాఖ, అధికారులకు సహకరించాలి. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి వాహనాలను నియమిత వేగం తో నడిపి ప్రమాదాలకు గురికాకుండా గమ్యం గమ్యం చేరేందుకు సహకరించాలి. 

- పీ.సర్వయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్, మహబూబాబాద్ రూరల్