calender_icon.png 12 January, 2026 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అంటే డిసిప్లిన్..డిసిప్లిన్ అంటే కాంగ్రెస్

10-01-2026 12:00:00 AM

  1. గ్రామాల అభివృద్ధికి దిశానిర్దేశం!

గ్రామ సర్పంచ్ పదవిలో కుటుంబ సభ్యుల జోక్యం ఉండకూడదు

5000 మంది సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మదన్మోహన్

ఎల్లారెడ్డి, జనవరి9, (విజయ క్రాంతి) : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యు లతో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహిం చారు. లింగంపేట్ మండల కేంద్రంలోని జీఎన్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్‌హాల్లో నిర్వహిం చిన ఈ కార్యక్రమానికి 176 గ్రామాల నుంచి 5 వేల మందికి పైగా పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.

కార్యక్రమం ప్రారంభంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ జ్యోతిని వెలిగించి సభను ఆరం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన, వారందరూ విధుల పట్ల అవగాహన కలిగి, పరస్పర సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మహిళా సర్పం చులు ముందుండి పని చేయాలని అన్నారు. కుటుంబసభ్యుల జోక్యం చేసుకో కూడదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇప్పుడు అందరూ కలిసి పునర్నిర్మాణం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, త్రాగునీరు, ప్రాథమిక ఆరోగ్య సదుపాయా లు కల్పించేలా పని చేయాలన్నారు. ప్రతి పంచాయతీ కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేయాలి, నెలకు రెండుసార్లు ప్రభు త్వ పాఠశాలల్లో జీపీ పాలకులు మధ్యాహ్న భోజనం చేయాలని అన్నారు. ప్రతి సర్పంచుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు కల్పించడం తన ఆశయమని చెప్పారు.

సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేయాలని కోరారు. సర్పంచులు హుందాగా పని చేసి, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకోవాలని సలహా ఇచ్చారు. సర్పంచ్ ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 209 పంచాయతీల్లో 176 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరడం ప్రజల నమ్మకా నికి నిదర్శనమన్నారు. 46 సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించా మని సంతోషం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అంటే డిసిప్లిన్& డిసిప్లిన్ అంటే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఈ ఉత్సాహంతో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పి టిసి ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహుమతిగా అందిం చాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మండల అధ్యక్షులు, ఎఎంసీ చైర్మన్లు, సీనియర్ నాయకులు, నూతన సర్పంచులు, కార్యక ర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.