22-07-2025 12:49:29 AM
నిర్మల్, జూలై 21 (విజయక్రాంతి): నిర్మల్‌లో నిర్వహించిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమం ఆరంభంలో తెలంగాణ రా ష్ట్ర గీతాన్ని అవమానించినందుకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించినందుకు బీజేపీ ఎల్పీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన దిష్టిబొమ్మను సోమవారం నిర్మల్ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లో దహనం చేశారు. తెలంగాణ అమరవీరు ల జ్ఞాపకార్ధంగా రచించుకున్న రాష్ట్ర గీతాన్ని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్య క్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాందేడపు చిన్ను ఆత్మ డైరెక్టర్ రామ్ రెడ్డి, జిల్లా యువజన అధ్యక్షులు సమరసింహారెడ్డి, దేవరకోట ఆలయ చైర్మన్ కొండ శ్రీని వాస్, సాయిబాబా ఆలయ చైర్మన్ బూరా జ్, నిర్మల్ మండల అధ్యక్షులు కుంట వేణుగోపాల్, హజార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.